ఈ ప్రపంచాన్నే మనం బహిష్కరిద్దాం  | Sakshi
Sakshi News home page

ఈ ప్రపంచాన్నే మనం బహిష్కరిద్దాం 

Published Sat, Feb 17 2024 1:02 AM

Rajendra Prasad Movie 65 Trailer Released - Sakshi

‘ఈ ప్రపంచం మన ప్రేమని తిరస్కరిస్తే.. ఈ ప్రపంచాన్నే మనం బహిష్కరిద్దాం’ (రాజేంద్ర ప్రసాద్‌), ‘అందరూ నన్ను ఏడిపించినవాళ్లే.. కానీ, నాకోసం ఏడ్చింది నువ్వు ఒక్కడివే’ (జయప్రద) వంటి డైలాగులు ‘లవ్‌ @65’ మూవీ ట్రైలర్‌లో ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్, జయప్రద ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లవ్‌ @65’. వీఎన్‌ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీక్‌ రాజు, స్పందన పల్లి ముఖ్య పాత్రలు పోషించగా, సునీల్, అజయ్‌ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు.

టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానున్న సందర్భంగా శుక్రవారం ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘రాత్రి ఇక్కడి నుంచి ఇద్దరు మిస్‌ అయిపోయారు సార్‌’, ‘ఎవరు’, ‘మా కావేరి సార్‌.. మా ఆది సార్‌’, ‘ఎలా మిస్సయ్యారు’, ‘వాళ్లు లేచిపోయారు సార్‌’, ‘ఇద్దరూ మేజర్లా’, ‘కాదు సార్‌.. ఆయనకి డెబ్బై నిండాయి.. ఆవిడకి ఓ అరవైఐదు దాక ఉంటాయి’.. వంటి డైలాగులు ట్రైలర్‌లో ఉన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌ తుమ్మలపల్లి, సంగీతం: అనూప్‌ రూబెన్స్.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement