'భారతీ రాజా మరణం.. రాఘవ లారెన్స్ కీలక నిర్ణయం' | Raghava Lawrence Postponed His Key Decision after Bhararhiraja demise | Sakshi
Sakshi News home page

Raghava Lawrence: 'భారతీ రాజా మరణం.. రాఘవ లారెన్స్ కీలక నిర్ణయం'

Jun 10 2026 5:04 PM | Updated on Jun 10 2026 6:08 PM

Raghava Lawrence Postponed His Key Decision after Bhararhiraja demise

తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ప్రభంజనం తర్వాత మరో స్టార్ హీరో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. పాలిటిక్స్‌లో తన ఎంట్రీపై కీలక నిర్ణయం ప్రకటిస్తానని ఇప్పటికే రాఘవ లారెన్స్ వెల్లడించారు. ఈనెల 11న ఉదయం 9:30 గంటలకు కీలక ప్రకటన ఉంటుందని తెలిపారు. అయితే దర్శకుడు భారతీ రాజా మరణంతో తన సమావేశాన్ని 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు లారెన్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు.

రాఘవ లారెన్స్ తన ట్వీట్‌లో రాస్తూ.. 'అందరికీ నమస్కారం.. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ భరతిరాజా మృతికి సంతాపం ప్రకటించింది. ఈ నష్టం మా కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత వ్యక్తిగతంగా నన్ను బాధ కలిగిస్తోంది. భరతిరాజా చిత్ర పరిశ్రమకు చేసిన అపారమైన సేవ పట్ల గౌరవంతో.. నేను నా ప్రకటనను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నా. ఈనెల 12వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు నా నిర్ణయం ప్రకటిస్తా' అని పోస్ట్ చేశారు.

కాగా.. సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నుంచి టీవీకే తరఫున రాఘవ లారెన్స్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాఘవ లారెన్స్ ప్రకటనపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement