Pushpa Movie: పుష్ప నుంచి శ్రీవల్లి సాంగ్‌ విడుదల

Pushpa Movie Team Released Second Single of Srivalli song - Sakshi

స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. ఈ మూవీలో హీరోయిన్ రష్మిక మందన్నా. ఈ మూవీ నుంచి సెకండ్‌ సింగిల్‌ ‘చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.. మాటే మాణిక్యమాయేనే..’ ప్రోమో మంగళవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా పూర్తి లిరికల్‌ సాంగ్‌ను బుధవారం రిలీజ్‌ చేసింది చిత్ర బృందం.

ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్‌, ఫస్ట్‌లుక్‌, సాంగ్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కాగా తాజాగా వచ్చిన ఈ సాంగ్‌  ‘చూపే బంగారమాయనే శ్రీవల్లి...మాటే మాణిక్యమాయనే శ్రీవల్లి...చూపే బంగారమాయనే శ్రీవల్లి... నవ్వే నవరత్నమాయనే’ అనే పల్లవితో సాగి సంగీత ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. పల్లెటూరి యువకుడిగా అల్లు అర్జున్‌  సాంగ్‌లో పూర్తిగా ఒదిగిపోయి కనిపించాడు. పల్లెటూరి యువతిగా రష్మిక లుక్స్‌ ఇప్పటికే ఆకట్టుకోగా.. ఈ సాంగ్‌లో మరింత అమాయకంగా, అందంగా కనిపించింది.

కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ మూవీని రెండు పార్ట్స్‌గా విడుదల చేస్తుండగా.. మొదటి భాగం డిసెంబర్‌ 17న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top