
తెలుగులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ట్రెండ్‌కి తగ్గ సినిమాలు తీయలేక అవే మూసకథలతో తీయడంతో ప్రేక్షకుల నుంచి తిరస్కరణ ఎదురైంది. లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు ఘోరమైన ఫ్లాప్స్ అయ్యాయి. దీంతో ఆలోచనలో పడిన పూరీ.. తెలుగు హీరోలని కాదని తమిళ హీరో విజయ్ సేతుపతితో ఓ ప్రాజెక్ట్ ఓకే చేశాడు. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలైంది. ఇప్పుడు మూవీకి సంబంధించిన తొలి అప్‌డేట్ వచ్చే సమయం వచ్చేసింది.
(ఇదీ చదవండి: ఇండస్ట్రీలోకి వచ్చేసిన సూర్య కూతురు.. 17 ఏళ్లకే ఇలా)
చెన్నైలో ఆదివారం ఓ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇందులో టైటిల్, టీజర్ లాంచ్ చేయబోతున్నారు. గతంలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడే బెగ్గర్, మాలిక్ అనే టైటిల్స్ అనుకుంటున్నారని వినిపించింది. కానీ ఇప్పుడు అవేవి కాకుండా 'స్లమ్ డాగ్' టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. స్టోరీ ఓ బిచ్చగాడి జీవితానికి సంబంధించింది. దీంతో ఈ పేరు అయితే సరిగ్గా సరిపోతుందని మూవీ టీమ్ భావించినట్లుంది.
ఇందులో విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్త చేసింది. టబు, దునియా విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పూరీ దర్శకత్వం వహిస్తూనే మరోవైపు ఛార్మితో కలిసి నిర్మాతగా చేస్తున్నాడు. ఈ ఏడాది చివరలో రిలీజ్ ఉండొచ్చని టాక్. మరి రేపు జరగబోయే టీజర్ లాంచ్ ఈవెంట్‌లో రిలీజ్ తేదీపై ప్రకటన ఇస్తారేమో చూడాలి?
(ఇదీ చదవండి: మరోసారి తండ్రయిన హీరో సుహాస్)
