
మలయాళ సూపర్ హిట్ మూవీ ‘పథోంపథం నూట్టండు’ మూవీ తెలుగులో ‘పులి- 19వ శతాబ్దం’పేరుతో ఓటీటీలో విడుదలైంది. శనివారం రాత్రి నుంచి అమెజాన్ ఫ్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. వినయన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిజు విల్సన్ ఇందులో యోధుడుగా కనిపించారు. 19వ శతాబ్దంలో జరిగే కథ ఇది. అనంతపద్మనాభ స్వామి దేవాలయంలో జరిగే దొంగతనం, ఆ దొంగను పట్టుకునే పాయింట్‌తో ఈ సినిమా నడుస్తుంది.
(చదవండి: ఆస్తి కోసమే పవిత్రా లోకేష్ నరేష్‌తో ప్రేమాయణం నడుపుతుందా? ఆమె చెప్పిందిదే..)
ఈ క్రమంలో చూపించే విజువల్స్, స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయి. నాని దసరా, ప్రభాస్ ప్రాజెక్ట్ కే, వెంకటేష్ సైంధవ్ సినిమాలతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిన సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. థియేటర్స్‌లో ఆకట్టుకున్న ఈ చిత్రం..ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను సైతం అలరిస్తోంది.