బాహుబలి-3 గురించి బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన నిర్మాత | Producer Shobu Yarlagadda Made Interesting Comments On Baahubali 3 Movie, Deets Inside | Sakshi
Sakshi News home page

బాహుబలి-3 గురించి బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన నిర్మాత

Oct 7 2025 10:45 AM | Updated on Oct 7 2025 11:24 AM

Producer Shobu Yarlagadda comments on baahubali 3

ప్రభాస్‌, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కిన బాహుబలి మరోసారి అద్భుతాలను క్రియేట్‌ చేసేందుకు రెడీ అవుతుంది. ఈ మూవీ విడుదలై పదేళ్ల సందర్భంగా  ‘బాహుబలి: ది ఎపిక్‌’ (Baahubali: The Epic) పేరుతో ఒకే భాగంలో తీసుకొచ్చారు. అక్టోబర్‌ 31న విడుదల కానుంది. ఈ క్రమంలో బాహాబలి-3 గురించి వార్తలు వచ్చాయి. ఈ అంశం గురించి తాజాగా  నిర్మాత శోభు యార్లగడ్డ (Shobu Yarlagadda) స్పందించారు.  

‘బాహుబలి: ది ఎపిక్’ (Baahubali: The Epic) సినిమా చివరిలో ‘బాహుబలి 3’ ప్రకటిస్తారని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో నిర్మాత శోభు యార్లగడ్డ ఇలా  అన్నారు. అదంతా కేవలం రూమర్స్‌ మాత్రమేనని చెప్పారు.  పార్ట్‌-3 కోసం చాలా వర్క్‌ చేయాల్సి ఉందని తెలిపారు. అయితే, బాహుబలి 3 ఖచ్చితంగా జరుగుతోందని ప్రకటించారు. అనుకున్నంత సమయంలో  ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కాకపోవచ్చునని శోభు స్పష్టం చేశారు. ఫైనల్‌గా బాహుబలి 3 గురించి అప్‌డేట్‌ రావడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.

‘బాహుబలి: ది ఎపిక్‌’ పేరుతో అక్టోబర్‌ 31న విడుదల కానున్న ఈ చిత్రం రన్‌టైమ్‌ ఎంత ఉంటుందనేది క్లారిటీ ఇవ్వలేదు. అయితే, కొన్ని పాటలతో పాటు చలావరకు సీన్లు కూడా తొలగిస్తారని ప్రచారం ఉంది.  ఏ సన్నివేశాలను కట్‌ చేస్తారనే  ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement