Telangana Movie Ticket Price: Producer Natti Kumar Comments On Movie Ticket Rates In Telangana - Sakshi
Sakshi News home page

Cinema Ticket Rates: టికెట్‌ రేట్ల పెంపుతో చిన్న సినిమాలకు అన్యాయం

Published Mon, Dec 27 2021 10:04 AM

Producer Natti Kumar Comments On Movie Ticket Rates In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు భారీగా పెంచడం వల్ల చిన్న సినిమాలకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రముఖ దర్శక నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్‌ నట్టి కుమార్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘టికెట్ల రేట్లు అధికంగా పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవో చిన్న నిర్మాతలను నిరాశ పరిచింది. చిన్న సినిమాల కోసం ప్రత్యేకంగా ఒక షోకి అనుమతివ్వాలని కోరుతున్నా ఆ ఊసే లేదు. మల్టీప్లెక్స్‌లలో సినిమాటోగ్రఫీ యాక్ట్‌ 1955 ప్రకారం సీటింగ్‌ కెపాసిటీలో 10 శాతం కేటాయించి, టికెట్ల రేట్లను పేదవాడి కోసం కనిష్టంగా రూ.50గా నిర్ణయించాలి.

కానీ అలాంటి నిబంధనలు జీవోలో లేనే లేవు. తెలంగాణలోని థియేటర్లు ఏషియన్‌ సునీల్, ‘దిల్‌’రాజు చేతుల్లోనే ఉన్నాయి. టికెట్‌ ధరల పెంపుతో వాళ్లిద్దరికి మాత్రమే మేలు జరుగుతోంది. చిన్న సినిమాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను. పది రోజుల్లోగా చిన్న సినిమాలకు మేలు చేసే నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తా’అని నట్టి కుమార్‌ తెలిపారు.  
చదవండి: ఈసారి లవర్స్‌ డేను ముందుగా సెలబ్రేట్‌ చేసుకుంటారు: తమన్‌
చదవండి: 
Manchu Lakshmi: దానికోసం కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చిందంటున్న మంచు లక్ష్మి

Advertisement
Advertisement