'ప్రియాంక దంపతులకు ఆ అర్హత లేదేమో!' | Priyanka Chopra Befitting Reply To Journalist | Sakshi
Sakshi News home page

ప్రియాంక చోప్రాకు అర్హత ఉందా?

Mar 18 2021 7:55 AM | Updated on Mar 18 2021 7:55 AM

Priyanka Chopra Befitting Reply To Journalist - Sakshi

సెలబ్రిటీలకు అప్పుడప్పుడూ మనసు నొప్పించే విమర్శలు ఎదురవుతుంటాయి. అయితే వాటిని వాళ్లు ఎలా ఎదుర్కొంటారన్నది ముఖ్యం. కొందరు సుతి మెత్తగా ఇచ్చే సమాధానాలు  చెంప చెళ్లుమనేట్లు ఉంటాయి. ఓ ఆస్ట్రేలియన్‌ జర్నలిస్ట్‌కి ప్రియాంకా చోప్రా దాదాపు అలాంటి సమాధానమే ఇచ్చారు. అసలేం జరిగిందంటే.. సోమవారం 93వ ఆస్కార్‌ అవార్డుల నామినేషన్‌ జాబితాను తన భర్త నిక్‌ జోనస్‌తో కలిసి ప్రియాంకా చోప్రా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ జర్నలిస్ట్‌ ‘‘ఈ ఇద్దరంటే (ప్రియాంక, నిక్‌) నాకు గౌరవభావం లేదనను. కానీ సినిమా రంగానికి వాళ్ళ కంట్రిబ్యూషన్‌ ఆస్కార్‌ నామినేషన్లను ప్రకటించేంత అర్హత ఇస్తుందని నేననుకోవడం లేదు’’ అన్నారు.

‘‘ఒకరి అర్హతను నిర్ణయించేవి ఏంటి? అనే మీ ఆలోచనను స్వాగతిస్తున్నాను. అయితే 60కి పైగా నేను చేసిన చిత్రాల జాబితాను మీ కోసం ఇక్కడ ఇస్తున్నాను’’ అని ఆ జర్నలిస్ట్‌ ట్వీట్‌కి గట్టిగానే సమాధానం ఇచ్చారు ప్రియాంక. ఆమె ట్వీట్‌ చూసి, ‘చాలా కూల్‌గా భలే చెప్పావ్‌ ప్రియాంక’ అంటూ పలువురు నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకూ వెళ్లి, తనను నిరూపించుకున్నారు ప్రియాంకా చోప్రా. ప్రస్తుతం ఆమె హాలీవుడ్‌ చిత్రాలతో పాటు వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తున్నారు.

చదవండి: సితూ పాప నువ్వు అప్పుడే ఎదగకు ప్లీజ్..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement