సితూ పాప నువ్వు అప్పుడే ఎదగకు ప్లీజ్..

Tamannaah Shares Photos With Mahes Babu Daughter Sitara On Set - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు గారాల పట్టి సితార అప్పుడే పెద్దవ్వడం తనకు ఇష్టం లేదంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. తమన్నా, మహేశ్‌లు నటిస్తున్న ఓ కమర్షీయల్‌ యాడ్‌ షూట్‌ నిన్న దర్శకుడు సందీప్‌ వంగ డైరెక్షన్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తమన్నా, మహేశ్‌ గారాల పట్టి సితార పాపను సెట్‌లో కలిసింది. సితారతో కలిసి షూటింగ్‌ సెట్‌లో తమన్నా సందడి చేసి చిరు నవ్వులు చిందిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది.

అనంతరం ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. సితారతో అత్యంత సన్నిహితంగా దిగిన ఈ ఫొటోలకు ‘సీతు పాప నువ్వు ఇంత తొందరగా ఎదగకు(పెరగకు) ప్లీజ్‌’ అంటూ ముద్దులతో ఉన్న ఎమోజీలను జత చేసింది. అలాగే సితార కూడా తమన్నాతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. చూడండి నేను ఎవరినీ కలిశానో! నాన్నతో కలిసి ఆన్‌సెట్‌లో’ అంటూ ఫొటోలను పంచుకుంది. 

అయితే మహేశ్-నమ్రత శిరోద్కర్‌లు 2006లో సీక్రెట్‌గా ప్రేమ వివాహం చేసుకన్న సంగతి తెలిసిందే. 2006లో వీరికి కుమారుడు గౌతమ్‌ ఘట్టమేనేని జన్మించగా.. కూతురు సితార 2012లో పుట్టింది. కాగా సితారకు ఇప్పడు ఎనిమిదేళ్లు. ఇక తమన్నా ప్రస్తుతం తెలుగులో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ‘సీటిమార్’‌, ‘గుర్తుందా సీతకాలం’, ‘ఎఫ్‌-3’, ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’లో నటిస్తోంది. వీటితో పాటు బోలే చుడియాన్‌లో అనే హిందీలో మూవీలో కూడా నటిస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top