Priya Prakash Varrier వాన పాటకి చాన్స్‌ వస్తే కాదంటానా?

Priya Prakash Varrier Talks About rainy season - Sakshi

అలా కన్ను కొట్టి ఇలా ఫేమస్‌ అయిపోయారు ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. తొలి సినిమా ‘ఒరు అడార్‌ లవ్‌’ ప్రచారంలో భాగంగా విడుదల చేసిన ఈ కన్ను కొట్టే సీన్‌ ఆమెకు ‘వింక్‌ బ్యూటీ’ అనే పేరు తెచ్చింది. ఈ కేరళ కుట్టి ఇప్పుడు తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఇక.. ఈ బ్యూటీని ‘వానాకాలమ్‌’ ముచ్చట్లు అడిగి తెలుసుకుందాం.

► చిన్నప్పటి వర్షాకాలపు జ్ఞాపకాలు...
వర్షాకాలం రాగానే కొత్త గొడుగు కొనడం నాకో సరదా. అది కూడా ట్రాన్స్‌ప్యారంట్‌ గొడుగు, రెయిన్‌ కోట్‌ కొనుక్కునేదాన్ని. ఆ గొడుగు, రెయిన్‌ స్లిప్పర్స్‌ వేసుకుని, స్కూల్‌ బస్‌ కోసం వెయిట్‌ చేసి, స్కూల్‌కి వెళ్లడం అంటే నాకు భలేగా ఉండేది. బస్‌ కోసం వెయిట్‌ చేస్తున్న సమయంలో వేరే వాహనాలు వెళ్లినప్పుడు మా యూనిఫామ్‌ మీద బురదనీళ్లు పడేవి. చిన్నప్పటి వర్షాకాలపు జ్ఞాపకాలంటే నాకివే. ఆ రోజులే వేరు.

► మామూలుగా పిల్లలను వర్షంలో తడవనివ్వరు. మరి.. మీ ఇంట్లో?
వానలో తడిచినా ఏమీ అనేవాళ్లు కాదు. మా సొసైటీలో ఉండే పిల్లలమంతా వానలో తడుస్తూ ఆడుకునేవాళ్లం. వానలో తడుస్తూ దాగుడుమూతలు ఆడేవాళ్లం. చివరికి బ్యాడ్‌మింటన్‌ కూడా ఆడుకునేవాళ్లం. అయితే వానలో తడిచి, జ్వరం తెచ్చుకుంటే అప్పుడు తిట్లు పడేవి.
 

► కాగితపు పడవలు చేసేవారా?
చేసేదాన్ని. అది మాత్రమే కాదు.. వర్షం నీళ్లను సీసాల్లో పట్టి, ఆడుకునేదాన్ని.

► చివరిసారిగా ఫుల్లుగా ఎప్పుడు తడిశారు?
రష్యాలో... షాపింగ్‌ కోసం బయటకెళ్లాం. ఒక్కసారిగా బాగా వర్షం వచ్చింది. పరిగెత్తుకుంటూ పక్కనే ఉన్న చర్చిలోకి వెళ్లాం. అప్పటికే కొంచెం తడిసిపోయాం.

► వర్షాకాలం ఇష్టమేనా?
చాలా. నేను మాన్‌సూన్‌ లవింగ్‌ పర్సన్‌ని. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి నా మూడ్‌ కూడా అలానే ఉంటుంది. మంచి మ్యూజిక్‌ వింటూ, ఎంజాయ్‌ చేస్తుంటాను.

► నచ్చే రెయినీ ఫుడ్‌?
మా అమ్మగారు చేసే ఫుడ్‌ ఏదైనా ఇష్టమే. వాన అంటే మాత్రం న్యూడుల్స్‌ తినాల్సిందే.

► మరి.. వాన పాటల్లో నటించడం ఇష్టమేనా?
నేను ఫిల్మీ పర్సన్‌. వాన పాటకి చాన్స్‌ వస్తే కచ్చితంగా చేస్తాను. అంతెందుకు.. షవర్‌ కింద నిలబడి దాన్నే వాన అనుకుని, ఎంజాయ్‌ చేస్తుంటాను. ఇక వాన పాట అంటే కాదంటానా?

► రెయినీ సీజన్‌లో వర్క్‌ చేయడం ఇష్టమేనా?
అస్సలు ఇష్టం ఉండదు. ఇంటి నుంచి కాలు బయటపెట్టడానికి ఏమాత్రం ఇష్టపడను.

► నచ్చిన వాన పాట?
చాలా పాటలు ఉన్నాయి. ఒక్క పాట అంటే చెప్పలేను. అయితే రెయినీ సీజన్‌లో మెలోడీ సాంగ్స్‌ వింటాను. రెయినీ సీజన్‌ కోసం ప్రత్యేకంగా నా ప్లే లిస్ట్‌లో కొన్ని పాటలు పెట్టుకున్నాను. అవి వింటుంటాను.

► వర్షాకాలంలో ఇబ్బందులకు గురైన సందర్భాలు...
వ్యక్తిగతంగా నాకెలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. అయితే గతంలో కేరళలో వరదలు వచ్చినప్పుడు చాలా బాధపడ్డాను. దినదిన గండంలా గడిపారు. ఆ సమయంలో స్వయంగా క్యాంప్స్‌కి వెళ్లి నాకు చేతనైనంత సాయం చేశాను. ఇళ్లు కొట్టుకుపోవడంతో ఎక్కడ తలదాచుకోవాలో తెలీక వాళ్లు పడిన బాధ చూసి చలించిపోయాను. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top