
జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ పరమ్ సుందరి. కేరళ బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. పరమ్ సుందరి ట్రైలర్ రిలీజ్ తర్వాత చర్చిలో ఓ వివాదాస్పద సీన్తో విమర్శలొచ్చాయి. ఆ తర్వాత ఆ సీన్ మార్చడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. అంతేకాకుండా ఈ మూవీలో నటించడానికి మీకు కేరళ నటి ఒక్కరు కూడా దొరకలేదా అంటూ మేకర్స్ను కొందరు విమర్శించారు. కేరళ అమ్మాయి పాత్రకు జాన్వీ కపూర్ను తీసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మలయాళీ నటులకు టాలెంట్ లేదా? అని మేకర్స్ను ప్రశ్నించారు.
ఇదిలా పక్కనపెడితే పరమ్ సుందరిలో మలయాళీ ముద్దుగుమ్మ నటించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఒక్క కనుచూపుతో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగిపోయిన ప్రియా ప్రకాశ్ వారియర్ ఈ సినిమాలో కనిపించారు. అయితే ఇందులో ఆమె జూనియర్ ఆర్టిస్ట్గా కనిపించడంతో ఫ్యాన్స్ షాక్కు గురవుతున్నారు.
జాన్వీకపూర్ కంటే ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్గా తీసుకుంటే బాగుండని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో ఓరు అదార్ లవ్ మూవీలో ఒక్క కన్నగీటుతో యూత్ కలల రాణిగా ఫేమ్ తెచ్చుకుంది ప్రియా ప్రకాశ్. ఆ తర్వాత పలు మలయాళ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్లో కూడా కనిపించనుంది. ఇక పరమ్ సుందరి విషయానికొస్తే బాక్సాఫీస్ వద్ద బాగానే రాణిస్తోంది. రూ. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ. 34.25 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది.