పొద్దుపొద్దునే 'సలార్' టీజర్ రిలీజ్.. కారణం అదేనా? | Prabhas Salaar Teaser Time And Date | Sakshi
Sakshi News home page

Salaar Teaser: ప్రభాస్.. ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడా?

Jul 3 2023 4:28 PM | Updated on Jul 3 2023 5:08 PM

Prabhas Salaar Teaser Time And Date - Sakshi

డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్న సినిమా 'సలార్'. యాక్షన్ స్టోరీకి తోడు ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడం ఈ వెయిటింగ్‌కి కారణం. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు చిత్రబృందం.. టీజర్ విడుదల తేదీ, సమయాన్ని ఖరారు చేసింది. జూలై 6న ఉదయం 5:12 గంటలకు రిలీజ్ చేస్తామని ప్రకటించింది. మరీ అంత ఉదయాన‍్నే ఎందుకా అని అందరికీ సందేహం వచ్చుంటుంది. దీనికి కారణం అదేనా?

టీజర్ కోసం ఆత్రం!
'బాహుబలి' తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సాధించాయి. కానీ హిట్ అనిపించుకోలేకపోయాయి. ఇలా చెబితే ఫ్యాన్స్ బాధపడొచ్చు కానీ ఇదే నిజం! దీంతో డార్లింగ్ హీరోకి సరైన హిట్ పడాలని, అది 'సలార్'తోనే సాధ్యమవుతుందని వాళ్లు భావిస్తున్నారు. అందుకే టీజర్ తో యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సెట్ చేస్తే, విమర్శకుల నోళ్లు మూతబడతాయనేది వాళ్ల వాదన.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల‍్లోకి ఏకంగా 24 సినిమాలు)

అదే సెంటిమెంట్
ప్రభాస్ గత మూడు సినిమాల అప్డేట్స్ ని పరిశీలిస్తే మీకు ఓ విషయం క్లారిటీగా అర్థమవుతుంది. 'రాధేశ్యామ్' ఫస్ట్ లుక్, టీజర్, మూవీ రిలీజ్‌డేట్ లాంటివి ఉదయం 8:28, 8:45, 10:06 గంటలకు రిలీజ్ చేశారు. 'ఆదిపురుష్'‍ చిత్రానికి అయితే అప్డేట్స్ అన్నీ ఉదయం 7:11 గంటలకే ఇచ్చారు. ఇప్పుడు సలార్ టీజర్ అయితే మరీ పొద్దుపొద్దున అంటే ఉదయం 5:12 గంటలకే యూట్యూబ్ లో విడుదల చేస్తామని ప్రకటించారు. ఇదంతా చూస్తుంటే ప్రభాస్ ఏమైనా సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడా అనే సందేహం వస్తోంది.

టీజర్ లో ఆ డైలాగ్?
'సలార్' టీజర్ రిలీజ్ అప్డేట్ పోస్టర్ చూస్తే.. ఓ చేతిలో సుత్తి, మరో చేతిలో సిగరెట్, ఎదురుగా విలన్స్ ఉన్నారు. ఇదేదో హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ లా అనిపిస్తోంది. అంత ఉదయాన్ని టీజర్ రిలీజ్ చేయబోతుండటాన్ని బట్టి చూస్తుంటే.. 'సూర్యుడు కంటే సలార్ ముందొస్తాడు' లాంటి డైలాగ్ ఏదైనా టీజర్ లో ఉందా అనే డౌట్ వస్తోంది. అలానే సినిమా కలర్ టోన్ కి తగ్గట్లు.. పోస్టరు అన్నీ డార్క్ గా ఉన్నాయి. ఈ క్రమంలోనే టీజర్ ని కూడా డార్క్ గా ఉండే సమయంలోనే రిలీజ్ చేయాలని ఇలా ఏమైనా ప్లాన్ చేశారా అనిపిస్తుంది. వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే జూలై 6 వరకు ఆగాలి.

(ఇదీ చదవండి: చిరంజీవి-పవన్ కల్యాణ్.. మధ్యలో అనుష్క!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement