వాటిని అధిగమిస్తూ ఛాన్స్‌లు తెచ్చుకుంటున్నపూజా | Pooja Hegde Comments On Her Movie career | Sakshi
Sakshi News home page

వాటిని అధిగమిస్తూ ఛాన్స్‌లు తెచ్చుకుంటున్నపూజా

Apr 4 2026 7:32 AM | Updated on Apr 4 2026 9:18 AM

Pooja Hegde Comments On Her Movie career

సినిమాల్లో లక్కు అవకాశాలను అందించినా, నిలబెట్టేది మాత్రం ప్రతిభనే. అదే శాశ్వత స్థానాన్ని కల్పిస్తుంది. లక్కు, ప్రతిభలో మధ్య ఊగిసలాడుతున్న నటీమణుల్లో పూజాహెగ్డే ఒకరు. పుష్కరం కాలం పాటు కథానాయకిగా కొనసాగుతున్నారు. తెలుగులో అల్లుఅర్జున్‌ సరసన నటించిన అలవైకుంఠపురంలో, మహేష్‌బాబుకు జతగా నటించ్చిన మహర్షి వంటి చిత్రాలు మంచి విజయాలను సాధించడంతో పూజాహెగ్డేకి ఒక్కసారిగా స్టార్‌డమ్‌ వచ్చింది. అయితే ఆ తర్వాత నటించిన కొన్ని భారీ చిత్రాలు నిరాశపరచడంతో ఈమెకి అవకాశాలు కరువయ్యాయి.  

అదే సమయంలో ఈమె నటించిన బీస్ట్‌ చిత్రం కూడా డిజాస్టర్‌ అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బ్యూటీని హిందీ చిత్రాలు ఆదుకున్నాయి. అయితే అక్కడ కూడా సరైన విజయం లిభించలేదు. ఈమధ్య సూర్యతో నటించిన రెట్రో చిత్ర విజయం పూజాహెగ్డేకు మళ్లీ ఆశలను చిగురింపజేసింది.  కూలీ చిత్రంలో ఐటెం సాంగ్‌లో నటించి అలరించారు. ఇలాంటి తరుణంలో మరోసారి విజయ్‌తో జననాయకన్‌ చిత్రంలో నటించే అవకాశం వరించింది. అయితే ఈ చిత్రం సెన్సార్‌ సమస్యల్లో చిక్కుకుంది. 

ఇలాంటి పరిస్థితుల్లో పూజాహెగ్డే ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ చిత్ర పరిశ్రమలో జయాపజయాలు సరి సమానం అని పేర్కొన్నారు. తాను  నటిస్తూ బిజీగానే ఉన్నానని,  ఎవరి ఊహాత్మక ప్రశ్నలకు బదులు చెప్పదలుచుకోలేదన్నారు. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో ఒక్క చిత్రంలో నటిస్తున్న పూజాహెగ్డే తమిళంలో ధనుష్‌తో జత కట్టడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. 


   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement