సత్యం రాజేష్‌ హీరోగా  ‘టెనెంట్’ 

Polimera 2 Hero Satyam Rajesh Another Film Tenant Title Glimpse out - Sakshi

కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యం రాజేశ్‌..ఇప్పుడు హీరోగా దూసుకెళ్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఊరి పొలిమేర-2’ చిత్రం నవంబర్‌ 3న రిలీజ్‌ కాబోతుంది. త్వరలోనే ఆయన హీరోగా నటించిన ‘టెనెంట్‌’ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీ  టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ లాంచ్ చేశారు.

మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ ‘టెనెంట్’ చిత్రం మన చుట్టూ జరిగే సంఘటనలకి దగ్గరగా ఉండే ఒక సింపుల్ ఫ్యామిలీ ఎమోషనల్ మర్డర్ మిస్టరీ కథ. ముఖ్యంగా ఆడవాళ్లు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ‘అద్భుతం’ చిత్రాన్ని నిర్మించిన మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా.. ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ చిత్రానికి దర్శకత్వం వహించిన వై. యుగంధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ.. స్ర్కీన్‌ప్లే, సంభాషణల్ని కూడా అందించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top