సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న 'పర్‌ఫ్యూమ్'.. టైటిల్ సాంగ్ రిలీజ్! | Perfume Movie Title Song Released By Bhole Shavali and Bheems | Sakshi
Sakshi News home page

Perfume Movie: ' వీడెవడో అమ్మాయిల స్మెల్ కోసం చస్తుండు'.. ఆకట్టుకుంటోన్న టైటిల్ సాంగ్!

Published Wed, Nov 22 2023 7:06 PM | Last Updated on Wed, Nov 22 2023 7:11 PM

Perfume Movie Title Song Released By Bhole Shavali and Bheems  - Sakshi

చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘పర్‌ఫ్యూమ్’. జే.డి.స్వామి దర్శకత్వంలో తెరకకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ బ్యానర్స్‌పై  జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ భోలె షావలి, భీమ్స్ సిసిరోలియో చేతుల మీదుగా విడుదల చేశారు. 

ఈ పర్‌ఫ్యూమ్ టైటిల్ సాంగ్‌ను భీమ్స్ సిసిరొలియో కంపోజ్ చేయగా.. సురేష్ గంగుల సాహిత్యాన్ని రచించారు. ఈ పాటను వరం, కీర్తన శర్మ ఆలపించారు.  సినిమాలోని హీరో కారెక్టర్ మీద ఈ పాటను కంపోజ్ చేసినట్లుగా తెలుస్తోంది.  ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇంతవరకు ఎప్పుడు రాని స్మెల్ బేస్డ్ క్రైమ్ థ్రిల్లర్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కాగా.. ఈ చిత్రం నవంబర్ 24న థియేటర్లోకి రాబోతోంది. ఈ చిత్రానికి అజయ్ సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement