అతని ఆలోచన ఒక చరిత్ర సృష్టించబోతోంది | Peanut Diamond Telugu Movie Teaser Launched By Dil Raju | Sakshi
Sakshi News home page

ఆసక్తిని రేకిస్తున్న ‘పీనట్‌ డైమండ్‌’ టీజర్‌‌

Mar 20 2021 3:44 PM | Updated on Mar 20 2021 3:44 PM

Peanut Diamond Telugu Movie Teaser Launched By Dil Raju - Sakshi

అభినవ్‌ సర్దార్, రామ్‌ హీరోలుగా, చాందినీ తమిళరసన్, షెర్రీ అగర్వాల్‌ హీరోయిన్లుగా వెంకటేశ్‌ త్రిపర్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పీనట్‌ డైమండ్‌’. ఎఎస్‌పి మీడియా హౌస్, జీవీ ఐడియాస్‌పై అభినవ్‌ సర్దార్, వెంకటేశ్‌ త్రిపర్ణ నిర్మించిన ఈ మూవీ టీజర్‌ని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు విడుదల చేశారు. సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది.‘అతని గమ్యం విజయమా లేదా మరణమా అనేది అతను ఎంచుకునే మార్గాల మీద ఆధారపడి ఉంటుంది’ అంటూ శుభలేఖ సుధాకర్ చెప్పే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో ఈ సినిమా టీజర్‌ సాగుతుంది.

అతని గురించి చెప్పవా తాతయ్యా అని ఓ చిన్నారి అడగ్గా.. ‘అతని జీవితాన్ని మలుపు తిప్పే రెండు సంఘటనలు ఒకే రోజు చోటు చేసుకున్నాయి. ఆ చుట్టు పక్కల గ్రామాల ప్రజలందరూ వజ్రాల వేటకు బయలుదేరిన వేళ అతని అడుగులు మాత్రం వేరే వైపుకు మొదలయ్యాయి. ఎంతో జ్ఞానం ఉన్నా సరే అసుర లక్షణాలు కలిగి ఉండటం వల్ల అతని జీవితంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎవరికైన ఒక విలువైన వజ్రం దొరికితే దాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటారు లేదా దాన్ని వాడుకుంటారు. కానీ అతను మాత్రం అందరిలా ఆలోచించలేదు. ఆ రోజు అతనికి వచ్చిన ఆలోచన ఒక చరిత్ర సృష్టించబోతోంది’ అంటూ ఆసక్తికరంగా టీజర్‌ని ముగించారు. ఓవర్ ఆల్ గా ఈ టీజర్‌ సినిమాపై మంచి ఆసక్తిని క్రియేట్ చేసింది అనే చెప్పాలి. ఈ చిత్రానికి వెంక‌టేష్ త్రిప‌ర్ణ క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం అందిస్తున్నారు.  `బెంగాల్ టైగ‌ర్` ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా  జె. ప్ర‌భాక‌ర రెడ్డి ఛాయాగ్ర‌హ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ  ఒకేసారి రెండు టైం లైన్స్ లో జరిగే కథగా తెరకెక్కుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement