సినిమాలో ఘోరమైన చావు.. రియల్‌ లైఫ్‌లో కూడా.. | Pariyerum Perumal Fame Karuppi dog Dies in Accident | Sakshi
Sakshi News home page

దీపావళి రోజే మరణించిన శునకం.. హీరో ఎమోషనల్‌ పోస్ట్‌

Nov 4 2024 8:21 PM | Updated on Nov 4 2024 8:25 PM

Pariyerum Perumal Fame Karuppi dog Dies in Accident

'పరియెరుమ్‌ పెరుమాల్‌' అనే తమిళ సినిమాలో నటించిన కరుప్పి అనే శునకం దీపావళి పండగ రోజే మరణించింది. పటాకుల మోతతో బెంబేలెత్తిపోయిన శునకం ఇంట్లో నుంచి బయటకు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో బస్సు కింద పడి చనిపోయింది. తమిళనాడులోని తిరునల్వేలిలో ఈ ఘటన జరిగింది.

సినిమాలో యాక్సిడెంట్‌
ఈ విషాద వార్తను హీరో కాతిర్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని రాసుకొచ్చాడు. శునకంతో కలిసున్న ఫోటోలను నెట్టింట షేర్‌ చేశాడు. కాగా పరియెరుమ్‌ పెరుమాల్‌ సినిమాలో కరుప్పిని రైల్వేట్రాక్‌కు కట్టేయడంతో అది ఘోరంగా చనిపోతుంది. సినిమాలోనే అనుకుంటే నిజ జీవితంలోనూ అలాంటి మరణమే సంభవించడంతో అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 

సినిమా వివరాలు
కాగా పరియెరుమ్‌ పెరుమాల్‌ సినిమాలో కాతిర్‌, ఆనంది హీరోహీరోయిన్లుగా నటించగా యోగిబాబు, లిజేష్‌, మరిముత్తు కీలక పాత్రలు పోషించారు. మారి సెల్వరాజ్‌ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించాడు. ఈ మూవీ 2018లో రిలీజైంది.

Advertisement
 
Advertisement
Advertisement