జోరుమీద ఉన్న జయశంకర్‌.. కాజల్‌ ఔట్‌.. నయన్‌ ఇన్‌

Paper Boy Director Jayashankar Plans To Lady Oriented Film With Nayanthara - Sakshi

‘పేపర్ బాయ్’ఫేమ్‌ జయశంకర్‌ కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన యాంకర్‌ అనసూయతో ఓ సినిమా చేస్తున్నాడు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ..ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనుల్లో బిజీగా ఉంది. ఢిఫరెంట్‌ కాన్సెఫ్ట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘అరి’అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు సమాచారం. సాయి కుమార్, అక్షపర్దసాని, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఆర్వీ సినిమాస్‌ బ్యానర్‌పై  ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు.
(చదవండి: బాలీవుడ్‌ నటికి సల్మాన్‌ ఖాన్‌ బంపర్‌ ఆఫర్‌, కావాల్సినంత తీసుకో!)

ఈ చిత్రం విడుదలకు రెడీగా ఉండగా...అప్పుడే మరో చిత్రాన్ని లైన్‌లో పెట్టాడు జయశంకర్‌. నయనతారతో ఓ లేడి ఓరియెంటెడ్‌ మూవీని తెరకెక్కించబోతున్నాడట. తొలుత ఈ చిత్రానికి కాజల్‌ని హీరోయిన్‌గా అనుకున్నారట. కానీ ఆమె ప్రెగ్నెన్సీ కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో కాజల్‌ ప్లేస్‌లో నయనతారను తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే దర్శకుడు నయన్‌కు స్టోరీ వినిపించాడట. ఆమెకు కథ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top