Ester Noroha : 'నమ్మకాన్ని బ్రేక్‌ చేశాడు.. పెళ్లైన 16రోజులకే అతని నిజస్వరూపం బయటపడింది'

Noel Ex Wife Ester Noroha Reveals About Her Divorce - Sakshi

'భీమవరం బుల్లోడు' సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది ఎస్తర్‌ నోరోన్హ. 'జయజయజానకి నాయక'లో ఓ చిన్న పాత్ర చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అంతలోనే ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. ఈ క్రమంలో సింగర్‌ నోయల్‌ను ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లి చేసుకున్న ఆరు నెలల్లోనే వీరు విడాకులు తీసుకున్నారు.

ప్రస్తుతం కెరీర్‌లో బిజీగా ఉన్నానంటోంది ఎస్తర్‌. రీసెంట్‌గా ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటరవ్యూలో ఆమె మరోసారి నోయెల్‌పై కామెంట్స్‌ చేసింది. అతనితో విడిపోయాక నాపై నెగిటివ్‌ ప్రచారం చేశాడు. విడాకుల తర్వాత బిగ్‌బాస్‌లోకి వెళ్లిన నోయెల్‌ ఆ ఇష్యూని సానుభూతి కోసం వాడుకున్నాడు. మనుషులు ఇలా కూడా ఉంటారా అని అప్పుడు అర్థమయ్యింది.

నేనేదే తప్పు చేసినట్లుగా చిత్రీకరించాడు. దీంతో సోషల్‌ మీడియాలో నాపై చాలా ట్రోల్స్‌ వచ్చాయి. ఒకతను అయితే నువ్వు హైదరాబాద్‌కి వస్తే యాసిడ్‌ పోస్తానంటూ బెదిరించాడు. మంచితనం అనే ముసుగులో నోయెల్‌ సింపతీ క్రియేట్‌ చేసుకున్నాడు. కానీ నిజం ఏంటన్నది నాకు తెలుసు కదా.. పెళ్లయిన 16రోజులకే అతని నిజస్వరూపం తెలుసుకున్నా. అందుకే విడాకులు తీసుకున్నా అంటూ చెప్పుకొచ్చొంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top