Nidhi Agarwal: అగ్ర హీరోలతో నటించినా దక్కని స్టార్ ఇమేజ్, అవకాశాల కోసం నిధి వేట

హీరోయిన్ నిధి అగర్వాల్ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించినా సరైన గుర్తింపు లభించలేదు. టాలీవుడ్‌లో ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ మూవీలో భాగమయినప్పటికీ స్టార్ ఇమేజ్ ఆమెకు అందని ద్రాక్షలానే ఊరిస్తోంది. పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదు. కోలీవుడ్‌లోనూ జయం రవి, శింబు, ఉదయనిధి స్టాలిన్ వంటి స్టార్ హీరోలతో జతకట్టింది. అయితే ఈమెకు ఇక్కడ విజయాల కంటే వదంతులే ఎక్కువగా వచ్చాయని చెప్పవచ్చు. నటుడు శింబుకు జంటగా ఈశ్వరం చిత్రంలో నటించినప్పుడు ఆయనతో ప్రేమాయణం అంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఇటీవల ఉదయనిధి స్టాలిన్ సరసన కలగతలైవన్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకుంది.
ఇందులో గ్లామర్‌కు దూరంగా నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. అయినా కోలీవుడ్‌లో అవకాశాలు రావడం కష్టమైపోయింది. ఇక తెలుగులో కూడా ఒకే ఒక్క చిత్రం చేతిలో ఉంది. పవన్ కళ్యాణ్‌కు జంటగా నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రమే అది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. దీంతో నిధి అగర్వాల్ ఇప్పుడు అవకాశాల వేటలో పడింది. ఇందుకు గ్లామర్ బాటను ఎంచుకుంది. అలా ప్రత్యేకంగా ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకుని తీయించుకున్న గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరి ఆమెకు ఎంతవరకూ ఫలితాన్ని ఇస్తాయో చూడాలి.
మరిన్ని వార్తలు :