Vignesh Shivan And Nayanthara Seek Blessings At Kumbakonam Temple, Video Viral - Sakshi
Sakshi News home page

కులదైవం సేవలో నయన్, విఘ్నేశ్‌.. వీడియో వైరల్‌

Apr 6 2023 9:26 AM | Updated on Apr 6 2023 10:10 AM

Nayanthara And Vignesh Shivan Visit Their Ancestral Temple - Sakshi

నటి నయనతా, విఘ్నేశ్‌ శివన్‌ దంపతులు బుధవారం ఉదయం తమ కులదైవాన్ని దర్శించుకున్నారు. వివరాలు.. గత ఏడాది అక్టోబర్‌ 9న సరోగసీ విధానం ద్వారా వీరు కవల పిల్లలకు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. కాగా ఆ పిల్లలకు ఇటీవల ఒక వేదికపై ఉయిర్‌ రుద్రోనీల్‌ ఎన్‌.శివన్, ఉలగ్‌ దైవీక్‌ ఎన్‌.శివన్‌ అనే పేర్లు పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ దంపతులు బుధవారం ఉదయం తంజావూర్‌ జిల్లా పాపనాశం సమీపంలోని కులదైవం మేలవళత్తూర్‌ ఆట్రంగరై శ్రీ కాంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా తమ పిల్లల నామకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ పిల్లల శ్రేయస్సు కోసం తమ చిత్రాల విజయాల కోసం ప్రార్థించి ప్రత్యేక పూజలు చేశారు.

ప్రస్తుతం నయనతార హిందీలో అట్లీ దర్శకత్వంలో షారూఖ్‌ఖాన్‌కు జంటగా జవాన్‌ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో తన 75వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. వీటితో పాటు నటుడు లారెన్స్‌ కథానాయకుడిగా నటించనున్న  చిత్రంలోనూ నటించడానికి పచ్చజెండా ఊపారు. ఈ చిత్రాన్ని దర్శకుడు లోకేశ్‌కనకరాజ్‌ నిర్మించనున్నారు. అదేవిధంగా దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ అజిత్‌ హీరోగా చేయాల్సిన చిత్రం చేజారిపోయిన విషయం తెలిసిందే. తాజాగా నటుడు కమలహాసన్‌ నిర్మించనున్న చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధం అవుతున్నట్లు, ఇందులో దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement