ఘంటసాల రత్నకుమార్‌కు ఘన నివాళి 

Navasahiti International Team Tribute To Ghantasala Ratnakumar - Sakshi

కొరుక్కుపేట(తమిళనాడు): అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు కుమారుడు ఘంటసాల రత్నకుమార్‌కు పలువురు తెలుగు ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు.నవసాహితీ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి వర్చువల్‌ విధానం ద్వారా ఘంటసాల రత్నకుమార్‌ సంస్మరణ సభను నిర్వహించారు. తనకంటూ ప్రత్యేకత స్థానాన్ని సంపాదించుకున్న రత్నకుమార్‌ దూరం కావడం తెలుగువారికి, సినీ పరిశ్రమకు తీరనిలోటని వ్యాఖ్యానించారు. ఘంటసాల జయంతి, వర్ధంతిని అధికారికంగా రెండు తెలుగు రాష్ట ప్రభుత్వాలు, పొట్టి శ్రీరాములు మెమోరియల్‌ కమిటీ జరపాలని కోరారు.

అలాగే తెలుగువారికి చారిత్రాత్మక చిరునామాగా నిలిచిన ఆంధ్రాక్లబ్‌ ఆవరణంలో ఘంటసాల విగ్రహం స్థాపించాలన్నారు. వచ్చే డిసెంబర్‌లో ప్రారంభమయ్యే ఘంటసాల శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆ మహనీయునికి మనం అర్పించగల నివాళి ఇదే అని నవ సాహితీ ఇంటర్నేషనల్‌ తీర్మాణం చేసింది. వర్చువల్‌ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో నవ సాహితీ ఇంటర్నేషనల్‌ అధ్యక్షుడు సూర్యప్రకాష్‌రావు, ఝాన్సీ లక్ష్మి, శ్రీలక్ష్మి, ఏపీ చాప్టర్‌ అధ్యక్షులు పద్మశ్రీ డాక్టర్‌ కూటి కుప్పల సూర్యారావు, చెన్నైలోని తెలుగు ప్రముఖులు జేకే రెడ్డి, సీఎంకే రెడ్డి, మాధవపెద్ది సురేష్, శ్రీదేవి రమేష్‌ లేళ్లపల్లి, మాధురి, డాక్టర్‌ లక్ష్మీప్రసాద్, గుడిమెట్ల చెన్నయ్య, కందనూరు మధు, మాధవపెద్ది మూర్తి, భువనచంద్ర, డాక్టర్‌ మన్నవ గంగాధరప్రసాద్‌ పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top