Taraka Ratna : 'తారకరత్న మరణాన్ని అలేఖ్య జీర్ణించుకోలేకపోతుంది'.. కుటుంబ సభ్యుల ఆవేదన

నందమూరి తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి అస్వస్థత్రకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించే యోచనలో ఉన్నారు. రెండు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో అలేఖ్య నీరసంగా ఉందని తెలిపారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చిన్న వయసులోనే ఇలా దూరం కావడం అలేఖ్య జీర్ణించుకోలేకపోతుందని కుటుంస సభ్యులు పేర్కొన్నారు.
ప్రస్తుతం అలేఖ్యా రెడ్డి తీవ్ర మానసికి ఒత్తిడికి గురవుతుందని, తిరిగి మామూలు మనిషి కావడానికి సమయం పడుతుందని తెలిపారు. కాగా గత 27న తీవ్ర గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాల ఆసుపత్రిలో చేరిన తారకరత్న గతరాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన్ను బతికించేందుకు విదేశీ వైద్యులను సైతం రప్పించి చికిత్స అందించారు. కానీ వైద్యులు చేసిన ప్రయత్నాలు, అభిమానుల ప్రార్థనలేవీ ఫలించలేదు.
23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న చిన్న వయసులోనే తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లారు. అయితే తారకరత్నను ఆసుపత్రిలో చేర్పించిన మొదటి రోజు నుంచే భార్య అలేఖ్యా రెడ్డి అతనితోనే ఉన్నారు. భర్త ఆరోగ్యం కోసం ఆమె నిత్యం పూజలు చేసేవారట. ఈ క్రమంలో తారకరత్న మరణం ఆమెను తీవ్రంగా కుంగదీసింది.