టైటిల్‌కి వేళాయె! | Nandamuri Balakrishna Next Movie title to be revealed on 21st Oct 2022 | Sakshi
Sakshi News home page

టైటిల్‌కి వేళాయె!

Published Mon, Oct 17 2022 5:05 AM | Last Updated on Mon, Oct 17 2022 5:05 AM

Nandamuri Balakrishna Next Movie title to be revealed on 21st Oct 2022 - Sakshi

బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవి శంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి ‘అన్నగారు’, ‘వీరసింహారెడ్డి’, ‘రెడ్డిగారు’, ‘జై బాలయ్య’ అనే టైటిల్స్‌ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ఈ నెల 21న ప్రకటించనున్నట్లు చిత్రయూనిట్‌ వెల్లడించింది. మరి.. తెరపైకి వచ్చిన టైటిల్స్‌లో ఏదైనా ఒకటి ఫిక్స్‌ అవుతుందా? లేక కొత్త టైటిల్‌ ఖరారు చేస్తారా? అనే విషయం తెలియాలంటే ఈ నెల 21 వరకు వేచి చూడాలి. దునియా విజయ్, వరలక్ష్మీ శరత్‌కుమార్, చంద్రికా రవి(స్పెషల్‌ నంబరు) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం:తమన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చందు రావిపాటి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement