అన్‌స్టాబుల్‌ విత్‌ ఎన్‌బీకే సీజన్‌-2: బాలయ్య ఫస్ట్‌లుక్‌ అవుట్‌, ట్రైలర్‌ వచ్చేది అప్పుడే

Nandamuri Balakrishna First Look From Unstoppable With NBK Season 2 - Sakshi

నందమూరి నట సింహాం బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాక్‌షో ‘అన్‌స్టాబుల్‌ విత్‌ ఎన్‌బీకే’. ఆహాలో ప్రసారమైన ఈ టాక్‌ షో ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన మ్యానరిజం, పంచ్‌ డైలాగ్స్‌తో షోను బాలయ్య విజయవంతం చేశాడు. టీఆర్‌పీ రేటింగ్‌లోనూ రికార్డులు క్రియేట్‌ చేసిన ఈ షో రెండో సీజన్‌ దసరా నుంచి ప్రారంభం అవుతున్నట్లు ఇటీవల ఆహా అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా బాలయ్య ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేసింది ఆహా. ఎన్‌బీకే  బ్యాక్‌ అంటూ ట్రైలర్‌ అక్టోబర్‌ 4న రిలీజ్‌ చేయబోతున్నట్లు ప్రకటించారు. సూట్‌, బూటు, హ్యాట్‌తో ఉన్న బాలయ్య లుక్‌ షోపై ఆసక్తిని పెంచుకుంది. మరి ఈ సూపర్‌హిట్‌ టాక్‌ షో సీజన్‌-2కి వచ్చే ఫస్ట్‌ గెస్ట్‌ ఎవరన్నది చూడాల్సి ఉంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top