కులు మనాలీలో కూల్‌గా షూటింగ్ చేసేస్తున్నారు నాగార్జున. ఆయన హీరోగా తమిళ దర్శకుడు ఆర్‌ఏ కార్తీక్ దర్శకత్వంలో ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్) సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్యా రాజేశ్ నటిస్తున్నారు. టబు, సుష్మితా భట్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నాగార్జున కెరీర్‌లోని ఈ వందో సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కులు మనాలీలో జరుగుతోంది. నాగార్జున, ఐశ్వర్యా రాజేశ్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇలా కూల్‌గా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన తర్వాత పవర్‌ఫుల్‌గా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


