‘కృష్ణ వ్రింద విహారి’ సక్సెస్‌ మీట్‌.. నాగశౌర్య ఆసక్తికర వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

Naga Shourya: ‘కృష్ణ వ్రింద విహారి’ సక్సెస్‌ మీట్‌.. నాగశౌర్య ఆసక్తికర వ్యాఖ్యలు

Published Thu, Sep 29 2022 8:43 AM

Naga Shourya Interesting Comments At Krishna Vrinda Vihari Success Meet - Sakshi

‘‘కృష్ణ వ్రింద విహారి’ చాలా మంచి సినిమా. థియేటర్‌లో అద్భుతమైన స్పందన వస్తోంది. మొదటి రోజు నుంచి థియేటర్లు, వసూళ్లు పెరుగుతున్నాయి. పంపిణీదారులు, మేము అంతా ఆనందంగా ఉన్నాం. మా సినిమాకి గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని హీరో నాగశౌర్య అన్నారు. అనీష్‌ ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య, షిర్లీ సేటియా జంటగా నటించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన థ్యాంక్స్‌ మీట్‌లో నాగశౌర్య మాట్లాడుతూ.. ‘‘మంచి సినిమా ఇచ్చిన అనీష్‌ కృష్ణకు థ్యాంక్స్‌. ‘ఛలో’ తర్వాత నేను గర్వపడే హిట్‌ ఇచ్చినందు నిర్మాత, మా అమ్మకి స్పెషల్‌ థ్యాంక్స్‌’’ అన్నారు.

ఉషా ముల్పూరి మాట్లాడుత.. ‘‘కృష్ణ వ్రింద విహారి’ ఫ్యామిలీతో కలసి థియేటర్‌లో చూడాల్సిన సినిమా. ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. దసరా సెలవులు వచ్చాయి కాబట్టి ఇంకా సినిమా చూడని వారు చూడండి’’ అన్నారు. ‘‘మా సినిమా వసూళ్లు స్టడీగా కొనసాగుతున్నాయి. రాధికగారితో పాటు ఈ సినిమాలో పనిచేసిన అందరికీ థ్యాంక్స్‌. మా చిత్రాన్ని పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు అనీష్‌ ఆర్‌.కృష్ణ. ఈ కార్యక్రమంలో నటీనటులు హిమజ, రాహుల్‌ రామకృష్ణ, సత్య తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement