
తంగలాన్ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన నటిస్తోంది. మారుతి డైరెక్షన్‌లో వస్తోన్న ది రాజాసాబ్‌లో కనిపించనుంది. మలయాళం, తమిళ చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన మాళవిక మోహనన్ తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. ముంబయి లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. తన స్నేహితులతో కలిసి రాత్రి సమయంలో లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా కంపార్ట్‌మెంట్ వద్ద ఉన్న గ్లాస్ డోర్ నుంచి ఓ వ్యక్తి తమవైపే చూస్తూ ముద్దిస్తావా అని సైగలు చేశాడని తెలిపింది. ఆ సమయంలో తీవ్ర భయాందోళనకు గురైనట్లు మాళవిక పంచుకుంది. ముంబయి లాంటి నగరంలో మహిళల భద్రత లేదని నటి మాళవిక మోహనన్ తెలిపింది.
అయితే ఈ వార్త చూసిన ముంబయి పోలీసులు ఆమె జరిగిన ఘటనపై స్పందించారు. మాళివిక గారు మేము మీ గురించి వార్తల్లో చూశాం.. మీకెదురైన అనుభవాన్ని పంచుకున్నారు. నగరంలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అనుభవాలు ఆశ్చర్యకరంగా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి. నగరంలో రోజులో ఏ సమయంలో లేదా ఏ ప్రదేశంలోనైనా.. దయచేసి 112 లేదా 100 నంబర్‌లో మమ్మల్ని సంప్రదించండి. మేము వీలైనంత త్వరగా మీకు అండగా నిలుస్తామని తెలిపారు.
(ఇది చదవండి: రాత్రి ట్రైన్‌లో ప్రయాణం.. ఏకంగా ముద్దిస్తావా? అని అడిగాడు: మాళవిక మోహనన్)
ముంబయి పోలీసులు తమ పోస్ట్‌లో రాస్తూ..'ముంబై నగరం ఎల్లప్పుడూ మహిళలకు సురక్షితంగా ఉంటుంది. భద్రత మరింత మెరుగుపరచడానికి మేము ఎలాంటి చర్యలకైనా సిద్ధం. నేరస్థుడిని తగిన విధంగా.. చట్టబద్ధంగా శిక్షిస్తాం. దయచేసి మీ పేరును ఉపయోగించి ఈ విషయాన్ని వ్యాప్తి చేయండి. ఇలాంటి సమస్యలను పరిష్కరించడంలో బాగా సహాయపడుతుంది.' అని విజ్ఞప్తి చేశారు.
Ms @MalavikaM_
We came across an article in an online portal of a newspaper, which you shared your experince and raised concern over women safety in the city. We can imagine that experiences like these can be startling and leave a long term impact.
Thus we must reiterate…— मुंबई पोलीस - Mumbai Police (@MumbaiPolice) June 14, 2025