మృణాల్ ఠాకుర్ గ్లామర్ షో.. వీడియో సాంగ్ రిలీజ్ | Mrunal Thakur In Wow Song And Details | Sakshi
Sakshi News home page

Mrunal Thakur: టాలీవుడ్‌లో ఇలా బాలీవుడ్‌లో అలా

Apr 24 2026 1:55 PM | Updated on Apr 24 2026 2:04 PM

Mrunal Thakur In Wow Song And Details

మృణాల్ ఠాకుర్ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు 'సీతారామం', 'హాయ్ నాన్న' సినిమాల్లో ఈమె పోషించిన పాత్రలు, అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్‌లే గుర్తొస్తాయి. అంతెందుకు ఈ నెల ప్రారంభంలోనే రిలీజైన 'డెకాయిట్'లోనూ సరస్వతి అనే పాత్రలో అద్భుతంగా నటించింది. మూవీ ఓకే ఓకే అనిపించుకుంది గానీ మృణాల్ యాక్టింగ్‌ని అందరూ మెచ్చుకున్నారు.

(ఇదీ చదవండి: బ్లాక్‌బస్టర్ సక్సెస్.. 'ధురంధర్' నటుడికి కోటి రూపాయల గిఫ్ట్)

అయితే తెలుగులో ఫెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్న మృణాల్.. బాలీవుడ్‌లో మాత్రం పూర్తిగా గ్లామరస్ రోల్స్ చేస్తోంది. ఇప్పుడు కూడా వరుణ్ ధావన్‌తో 'హే జవానీ తో ఇష్క్ హోనా హై' అనే రొమాంటిక్ కామెడీ మూవీ చేసింది. ఇందులో మృణాల్‌తో పాటు పూజా హెగ్డే కూడా హీరోయిన్‌గా చేసింది.

వచ్చే నెల 22న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా టీజర్ కొన్నిరోజుల క్రితం రిలీజ్ చేయగా పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ట్రయాంగిల్ లవ్-ఫ్యామిలీ తరహా రొటీన్ స్టోరీనే అని చాలామంది పెదవి విరిచారు. కంటెంట్ పరంగా ఎలా ఉంటుందో పక్కనబెడితే గ్లామర్ విషయంలో మాత్రం తగ్గేదే లే అన్నట్లు ఉంది. తాజాగా 'వావ్' పేరిట మూవీలోని వీడియో సాంగ్ రిలీజ్ చేయగా.. ఇందులో మృణాల్ అదిరిపోయే గ్లామర్ షో చేసింది. పూజా హెగ్డే కూడా ఏ మాత్రం తగ్గకపోవడం విశేషం.

(ఇదీ చదవండి: కిస్ సీన్.. చాలా అసౌకర్యంగా అనిపించింది: హీరోయిన్ కాజోల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement