
సాక్షి, చెన్నై: సినీ, బుల్లితెర నటులకు ప్రోత్సాహక అవార్డుల ప్రదానోత్సవం శనివారం సాయంత్రం స్థానిక వడపళనిలోని శిఖరం హాల్‌లో సందడి సందడిగా జరిగింది. డాక్టర్ అనురాధ జయరామన్ మహా ఫైన్ ఆర్ట్స్, కలైమామణి నెల్‌లై సుందరరాజన్ యునైటెడ్ ఆర్టిస్ట్స్ ఆఫ్ ఇండియా సంస్థలు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
విశ్రాంతి న్యాయమూర్తి ఎ.రామమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని నటీనటులకు ప్రోత్సాహక అవార్డులను అందజేశారు. ఈ వేదికపై నటుడు ఆరియన్, బుల్లితెర నటుడు జిస్ను మీనన్, నటి రమ్యకృష్ణన్, లతాభాను, సీనియర్ పాత్రికేయుడు ఎం.టి.రామలింగం తదితరులు అవార్డులు అందుకున్నారు. కార్యక్రమంలో గ్లోబ ల్ మధుకృష్ణ, కోడంబాక్కం శ్రీ తదితరులు పాల్గొన్నారు.