మా సినిమాకు మంచి డేట్‌ను బుక్‌ చేసేసుకుంటున్నాం

Mosagallu and Most Eligible Bachelor movie release date fix - Sakshi

ఒకటి తండ్రి పుట్టినరోజు కానుకగా విడుదల కానున్న సినిమా...

ఇంకోటి లాక్‌డౌన్‌ లేకపోతే ఈపాటికి రావాల్సిన సినిమా...

మరోటి ఇంకా సెట్‌కే వెళ్లలేదు. రిలీజ్‌ డేట్‌ సెట్‌ చేసుకున్న సినిమా...

ఈ మూడు చిత్రాల రిలీజ్‌ డేట్స్‌ బుధవారం అధికారికంగా ప్రకటించారు. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్లు’. హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ చిన్‌ ఈ సినిమాను డైరెక్ట్‌ చేశారు. నటుడు, మంచు విష్ణు తండ్రి మోహన్‌బాబు పుట్టినరోజు మార్చి 19. తండ్రి బర్త్‌డే స్పెషల్‌గా ఈ సినిమాను మార్చి 19న విడుదల చేయనున్నారు విష్ణు. అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. 

బన్నీ వాసు, దర్శకుడు వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్‌ 19న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉండగా, ‘‘మేం మా సినిమాకు ఓ మంచి డేట్‌ను బుక్‌ చేసేసుకుంటున్నాం. టైటిల్, ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయకముందే అక్టోబర్‌ 1న  సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం’’ అని ప్రకటించాయి – జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు. గోపీచంద్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో ఈ సంస్థలు ఓ సినిమా నిర్మించనున్నాయి. ఈ సినిమా ఇంకా షూటింగ్‌ సెట్‌కి వెళ్లకముందే రిలీజ్‌ డేట్‌ సెట్‌ చేయడం విశేషం. మార్చి నెలలో షూటింగ్‌ ప్రారంభం కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top