‘వైల్డ్‌డాగ్‌ ప్రతివారం విడుదలయ్యే చిత్రాల్లో ఒకటి కాదు’

Megastar Chiranjeevi Review On Nagarjuna Akkineni Wild Dog Movie - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలైన మెగాస్టార్‌ చిరంజీవి, అక్కినేని నాగార్జున మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఇరువురి కుటుంబాల కార్యక్రమాలు, పార్టీలు వేడుకులకు కుటుంబ సమేతంగా హాజరవుతుంటారు. తాజాగా నాగార్జున వైల్డ్‌డాగ్‌ విడుదలైన సందర్భంగా చిరు ఇంటికి వెళ్లిగా ఆయన నాగ్‌ కోసం స్పెషల్‌గా చికెన్‌ వండిపెట్టారు. అదే విధంగా పర్సనల్‌ లైఫ్‌‌ అయిన ఫ్రొఫెషనల్‌ లైఫ్‌‌లోనైన వీరిద్దరూ ఒకరిఒకరూ మద్దతుగా ఉంటారు. చిరు సినిమాలను నాగ్‌, నాగ్‌ సినిమాలను చిరు ప్రమోట్‌ చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఈ క్రమంలో శుక్రవారం విడుదలై నాగ్‌ ‘వైల్డ్‌ డాగ్’ చిత్రం‌పై  చిరు రివ్యూ ఇచ్చారు. ఇది ప్రతి శుక్రవారం విడుదలయ్యే చిత్రం కాదన్నారు.

‘ఇప్పుడే ‘వైల్డ్‌ డాగ్‌’ చూసాను. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అతి దారుణమైన టెర్రరిస్ట్ ఘాతుకం వెనుకవున్న కిరాతకులని పట్టుకున్న ఆ ఆపరేషన్ని కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. ఆ ఆవేశాన్ని, ప్రాణాలకి తెగించి ఆ నీచుల్ని వెంటాడి వేటాడిన మన రియల్ లైఫ్ హీరోలని, ఆ రియల్ హీరోలని మరింత అద్భుతంగా చూపించిన సోదరుడు నాగార్జున, వైల్డ్ డాగ్ టీం, దర్శకుడు సోలోమోన్‌, నిర్మాత నిరంజన్‌ రెడ్డిల మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ప్రతివారం విడుదలయ్యే చిత్రాల్లోఒకటి కాదని, ప్రతి ఒక్క భారతీయుడు, తెలుగు వారు గర్వంగా చూడాల్సిన చిత్రమంటూ’ అయన ట్విటర్‌లో రాసుకొచ్చారు.

అంతేగాక అక్కినేని కోడలు సమంత సైతం వైల్డ్‌ డాగ్‌ మూవీపై తన రివ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. నాగార్జున నటించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `వైల్డ్ డాగ్‌` శుక్రవారం(ఏప్రిల్‌2)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.  ఈ చిత్రంలో  ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ ఏసీపీ విజయ్ వర్మగా నాగార్జున కనిపించగా ఆయన సరసన దియా మీర్జా నటించారు. ఈ సినిమాతో అహిషోర్ సాల్మన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. 

చదవండి: 
చిరు ఇంటికి నాగార్జున.. వంట చేసిన మెగాస్టార్‌ 
మామగారిలా ఎవరూ చేయలేరు : సమంత

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top