మామగారిలా ఎవరూ చేయలేరు : సమంత

Nagarjna Wild Dog Review By Samantha Akkineni  - Sakshi

హీరోయిన్‌ సమంత ఈ మధ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. తాజాగా  నాగార్జున నటించిన `వైల్డ్ డాగ్‌`మూవీపై రివ్యూ ఇచ్చింది. చాలాకాలంగా మంచి యాక్షన్‌ చిత్రాలను మిస్సవుతున్నానని ఆ లోటును  'వైల్డ్ డాగ్' చిత్రం తీర్చిందని తెలిపింది. ఎమోషనల్‌, యాక్షన్‌తో హాలీవుడ్‌ స్టయిల్‌లో ఈ సినిమా ఉందని చెప్పింది. ఏసీపీ విజయ్‌వర్మ పాత్రను నాగార్జున తప్ప మరెవ్వరు చేయలేరని తన మామగారిపై ప్రశంసల వర్షం కురిపించింది.

నాగార్జున నటించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `వైల్డ్ డాగ్‌` శుక్రవారం(ఏప్రిల్‌2)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.  ఈ చిత్రంలో  ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ ఏసీపీ విజయ్ వర్మగా నాగార్జున కనిపించగా ఆయన సరసన దియా మీర్జా నటించారు. ఈ సినిమాతో అహిషోర్ సాల్మన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. 

చదవండి: Wild Dog Movie Review: విజయ్‌ వర్మ ఇన్వెస్టిగేషన్‌ అదిరింది‌
‘వైల్డ్‌ డాగ్‌’ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఎంతంటే..
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top