Chiranjeevi Nagarjuna: చిరు ఇంటికి నాగార్జున.. వంట చేసిన మెగాస్టార్‌ - Sakshi
Sakshi News home page

చిరు ఇంటికి నాగార్జున.. వంట చేసిన మెగాస్టార్‌

Apr 2 2021 8:24 AM | Updated on Apr 2 2021 12:09 PM

Chiranjeevi Prepares Food For Nagarjuna Akkineni - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి, అక్కినేని నాగార్జున మంచి స్నేహితులని అందరికీ తెలిసిందే. ఇరు కుటుంబాల మ‌ధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. అంతేకాదు కరోనా తర్వాత వీళ్లిద్దరే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటూ ఉన్నారు. ఇరు కుటుంబాలలో జరిగే వేడుకలల్లో కూడా వీరు పాల్గొంటారు. వైల్డ్‌డాగ్‌ సినిమా ప్రమోషన్‌లో బిజీబిజీగా ఉన్న నాగార్జున తాజాగా చిరంజీవి ఇంటికి వెళ్లాడు. దీంతో చిరంజీవి అతిథి నాగార్జున కోసం స్వయంగా ఓ కమ్మని వంట చేశాడు. దీనికి సంబంధించి నాగార్జున ట్విటర్‌లో చిరంజీవితో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు. 

‘‘వైల్డ్‌ డాగ్‌’ విడుదల నేపథ్యంలో నా ఒత్తిడి తగ్గించేందుకు మెగాస్టార్‌ స్వయంగా  వంటచేశారు. నాకోసం రుచికరమైన విందుని ఏర్పాటు చేశారు. ఈ సాయంత్రం అద్భుతంగా గడిచింది. ధన్యవాదాలు’’ అంటూ నాగార్జున ట్వీట్‌ చేశారు. ఈ దృశ్యాన్ని చిరంజీవి సతీమణి సురేఖ ఫొటో తీసినట్లు నాగార్జున తెలిపారు.

అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు (ఏప్రిల్‌ 02)న విడుదల కాబోతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement