Megastar Chiranjeevi: ప్రస్తుత రాజకీయాలపై నేను ఎలాంటి సెటైర్లు వేయలేదు: చిరంజీవి

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తాను జనసేనకు మద్దతు ఇస్తానో లేదో కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు చిరంజీవి. అదే సమయంలో పవన్ కల్యాణ్ స్థాయిని ప్రజలే నిర్ణయిస్తారని చిరంజీవి పేర్కొన్నారు.
(చదవండి: ‘గాడ్ ఫాదర్’ టైటిల్ సాంగ్ రిలీజ్.. ఇంకెందుకు ఆలస్యం వినేయండి..!)
చిరంజీవి మాట్లాడుతూ..'నేను రాజకీయాల నుంచి తప్పుకుని సైలెంట్‌గా ఉన్నా. ప్రస్తుత రాజకీయాలపై నేను ఎలాంటి సెటైర్లు వేయలేదు. కేవలం సినిమాలో ఉన్న డైలాగులు మాత్రమే చెప్పా. పవన్ కల్యాణ్ జనసేనకు మద్దతు ఇస్తానో లేదో చెప్పలేను. నేను తప్పుకుంటనే పవన్‌కు లాభం చేకూరుతుందేమో' అని అన్నారు. దసరా కానుకగా గాడ్ ఫాదర్ ఆక్టోబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది.