God Father Title Song Release: మెగాస్టార్ 'గాడ్‌ ఫాదర్' టైటిల్ సాంగ్ మీరు విన్నారా?

Megastar God Father Title Song Released Today - Sakshi

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'గాడ్ ఫాదర్'. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌ మెగాస్టార్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

(చదవండి: 'గాడ్‌ఫాదర్‌' హిందీ ట్రైలర్ రిలీజ్.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్)

ఈ సందర్భంగా తాజాగా టైటిల్‌ సాంగ్‌ను అభిమానులతో పంచుకుంది  చిత్ర బృందం. చిరు పాత్రకు అద్దం పట్టే టైటిల్‌ సాంగ్‌ను రామజోగయ్యశాస్త్రి రాశారు. తమన్‌ పవర్‌ఫుల్‌ సంగీతం అందించారు. సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌, పూరీ జగన్నాథ్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో సూపర్‌ హిట్ మూవీ లూసిఫర్‌ రీమేక్‌గా గాడ్‌ ఫాదర్‌ ప్రేక్షకుల ముందుకొస్తోంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top