'సోలో బ్రతుకే సో బెటర్‌’ టీంకు మెగాస్టార్‌ విషెస్‌

Megastar Chiranjeevi Best Wishes To Solo Brathuke So Better Movie Team - Sakshi

సాయిధరమ్‌తేజ్, నభా నటేశ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ 25న ఈ సినిమా విడుదల కానుంది.  లాక్‌డౌన్‌ తర్వాత విడుదలవుతున్న మొదటి చిత్రం కావడంతో మెగాస్టార్‌ చిరంజీవి చిత్ర బృందానికి బెస్ట్‌ విషెస్‌ తెలియజేశారు. ఈ సినిమాకి లభించే ఆదరణ మొత్తం చిత్ర పరిశ్రమలోనే ఒక స్పూర్తిని, స్థైర్యాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదని అభిప్రాయపడ్డా్రు. ఈ సందర్భంగా ప్రేక్షకులు మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో ఎంజాయ్‌ చేయల్సిందిగా కోరుతున్నాను అంటూ ట్వీట్‌ చేశారు. (చెప్పింది చేసుకుంటూ వెళ్లడమే! )

 ఈ సినిమాతో సుబ్బు డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. తమన్‌ స‍్వరాలు సమకూరుస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మే 1న విడుదల కావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. థియేటర్లు తెరుచుకోగానే త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన మొదటి పాట ‘నో పెళ్లి’ సాంగ్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పాటలో రానా, వరుణ్ తేజ్ కూడా సందడి చేయడం విశేషం. ఈ సినిమా అనంతరం దేవ కట్టా దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్‌ మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. (పెళ్లి వార్త‌ల‌ను కొట్టిపారేసిన సాయిధ‌రమ్ తేజ్‌ )

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top