
దర్శకధీరుడు రాజమౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్‌కు నామినేట్ కాకపోవడంతో అభిమానులు, సినీనటులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ది కశ్మీర్ పైల్స్, ఆర్ఆర్‌ఆర్‌ను వెనక్కి నెట్టి గుజరాతీ ఫిల్మ్ 'ఛెల్లో షో' ఎంపికైంది . అయితే ఈ విషయంలో ఆర్ఆర్ఆర్‌కు మద్దతు కోసం చిత్రబృందం క్యాంపెయిన్ మొదలుపెట్టింది. మొత్తం 15 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ కోసం చిత్ర బృందం క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. తాజాగా ఈ అంశంపై టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా బదులిచ్చారు.
ఆస్కార్‌లో బెస్ట్ క్రింజ్ మూవీ అనే కేటగిరీ ఏదైనా ఉందా? అలాగైతే ఆర్ఆర్ఆర్ కచ్చితంగా ఆ విభాగంలో ఆస్కార్ గెలుస్తుందని ఓ నెటిజన్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దీనికి మంచు విష్ణు బదులిస్తూ.. 'భారతీయ సినిమాగా మనం ఎందుకు జరుపుకోకూడదు సోదరా? ఇది కేవలం ప్రాంతీయ చిత్రానికి దక్కే గౌరవం కాదు.. జాతీయంగా దేశం మొత్తం గర్వించదగ్గ విషయం' అంటూ పోస్ట్ చేశారు.
ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే థీమ్‌తో జక్కన్న రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ రూ. రూ. 1200 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇంతటి ప్రజాధారణ పొందిన ఈ చిత్రం భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డులకు ఎంపిక అవుతుంది అని అందరూ భావించారు. హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ మూవీ ఆస్కార్ బరిలో నిలవాలని కోరుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతీ మూవీ ఛైల్లో షోను ఆస్కార్స్‌కు నామినేట్ చేసింది.
Why don’t we celebrate Indian cinema my brother? Now it ain’t about regional pride but national pride. https://t.co/81kNIXgRMQ
— Vishnu Manchu (@iVishnuManchu) October 9, 2022