బేబీతో ఎంట్రీ  | Malayalam Singiner Arya Dayal First Time Singing Telugu Song | Sakshi
Sakshi News home page

బేబీతో ఎంట్రీ 

Published Fri, Mar 3 2023 5:01 AM | Last Updated on Fri, Mar 3 2023 5:01 AM

Malayalam Singiner Arya Dayal First Time Singing Telugu Song - Sakshi

మలయాళంలో గాయనిగా మంచి పేరు తెచ్చుకున్న ఆర్య దయాళ్‌ ‘బేబీ’ సినిమాతో తెలుగు పరిశ్రమకి పరిచయమవుతున్నారు. ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్, వైష్ణవి చైతన్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబీ’. సాయి రాజేశ్‌ దర్శకత్వంలో ఎస్‌కేఎన్‌ నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్‌ కానుంది.

ఈ సినిమాలోని ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ పాట పాడారు ఆర్య దయాళ్‌. ‘‘విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందించిన ఈ పాటకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఆర్య పాడిన తొలి తెలుగు పాట ఇదే కావడం విశేషం’’ అన్నారు ఎస్‌కేఎన్‌. ‘ఈ పాట ఇప్పటివరకూ అన్ని డిజిటల్‌ ΄్లాట్‌ఫామ్స్‌లో 2 కోట్ల వ్యూస్‌ సంపాదించింది’’ అన్నారు సాయి రాజేశ్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement