ఘనంగా దృశ్యం నటి కూతురు వివాహం, ఫోటోలు వైరల్‌

Malayalam Actress Asha Sharath Daughter Marries Boyfriend - Sakshi

ప్రముఖ మలయాళ నటి ఆశా శరత్‌ కూతురు ఉత్తర పెళ్లి ఘనంగా జరిగింది. తను ప్రేమించిన ప్రియుడు ఆదిత్య మీనన్‌తో ఆమె ఏడడుగులు వేసింది. శనివారం నాడు కొచ్చిలో ఘనంగా జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబాలు సహా బంధుమిత్రులు, సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వివాహ వేడుకకు మలయాళ తారలు కావ్య మాధవన్‌, అనుశ్రీ, లాల్‌ సహా తదితరులు హాజరయ్యారు. ఈ పెళ్లినంతటినీ ఆశా యూట్యూబ్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసినట్లు కనిపిస్తోంది.

కాగా ఉత్తర, ఆదిత్యలు గతేడాది అక్టోబర్‌ 23న నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఎంగేజ్‌మెంట్‌కు మలయాళ స్టార్‌ మమ్ముట్టి సైతం హాజరైన విషయం తెలిసిందే! ఇకపోతే ఉత్తర మెకానికల్‌ ఇంజనీర్‌ పూర్తి చేసింది. అనంతరం వార్విక్‌ బిజినెస్‌ స్కూల్‌లో జాయిన్‌ అయింది. తనొక క్లాసికల్‌ డ్యాన్సర్‌ కూడా! 2021లో ఆమె మిస్‌ కేరళ రన్నరప్‌గా నిలిచింది. మనోజ్‌ దర్శకత్వం వహించిన ఖెడ్డా సినిమాతో ఆమె వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. 

ఆశా శరత్‌ విషయానికి వస్తే.. మొదట మలయాళంలో పలు సీరియల్స్‌లో నటించింది. కుంకుమపువ్వు తనకు బాగా గుర్తింపును తెచ్చిపెట్టింది. అనంతరం ఫ్రైడే, కర్మయోధ, అర్ధనారి వంటి చిత్రాల్లో నటించింది. దృశ్యం, దృశ్యం 2లో ఐపీఎస్‌ పోలీసాఫీసర్‌గా నటించి మరింతమందికి చేరువైంది. తెలుగులో చీకటి రాజ్యం, భాగమతి చిత్రాల్లోనూ కీలకపాత్రల్లో నటించింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top