కారులో అనుమానాస్పదంగా ప్రముఖ నటుడి మృతదేహాం

Malayalam Actor Vinod Thomas Suspicious Dead In Car - Sakshi

మలయాళ చిత్రసీమలో ప్రముఖ నటుడు వినోద్ థామస్ (47) మరణించారు. ఆయన అనుమానాస్పదంగా మరణించినట్లు తెలుస్తోంది.  మలయాళంలో పాపులర్‌ సినిమా 'అయ్యప్పనుమ్ కోషియుమ్'లో ఆయన ప్రత్యేక పాత్రలో కనిపించాడు. ఇదే సినిమాను తెలుగులో పవన్‌ కల్యాణ్‌ భీమ్లా నాయక్ పేరుతో రీమేక్‌ చేశాడు.

గత రాత్రి (నవంబర్ 18) కేరళలోని కొట్టాయం జిల్లా బంబడి ప్రాంతంలోని ఓ హోటల్ పార్కింగ్ వద్ద చాలా సమయం నుంచి అనుమానాస్పదంగా ఒక కారు ఆగి ఉంది. దానిని గమనించిన హోటల్‌ సిబ్బంది. కారు వద్దకు వెళ్లి డోర్‌ ఓపెన్‌ చేయగా అందులో మృత దేహం కనిపించింది. వెంటనే డోర్‌ క్లోజ్‌ చేసి వారు  పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఈ మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వారు కారును పరిశీలించి ఆ మృతదేహాన్ని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో అతడు మలయాళ నటుడు వినోద్ థామస్ అని తేలింది.

‘అయ్యప్పనుమ్ కోషి’, ‘నాతోలి ఏరు ఒకిత మీనాళ్ల’ చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించడం గమనార్హం.  ఈ సంఘటనతో మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.వినోద్‌ థామస్‌ను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు. మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అలాగే వినోద్ థామస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుటుంబసభ్యులకు అప్పగించారు.ఈ కేసులో వినోద్ థామస్ మృతిపై పోలీసులు పలు కోణాల్లో ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top