Saranga Dariya Song Lyrics In Telugu: ‘సారంగ దరియా’ సాంగ్ తెలుగు లిరిక్స్.. మీ కోసం | Saranga Dariya Song Lyrics Love Story - Sakshi
Sakshi News home page

‘సారంగ దరియా’ సాంగ్ తెలుగు లిరిక్స్.. మీ కోసం

Published Sat, Apr 10 2021 12:50 PM

Love Story Saranga Dariya Song Lyrics In Telugu - Sakshi

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. ఈ మూవీకి శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వస్తున్న విషయం తెలిసిందే. అయితే మొదటిగా ఈ మూవీలోని ‘నీ చిత్రం చూసి’ అనే పాటను విడుదల చేశారు. ఆ పాట సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల మరో పాట ‘సారంగ దరియా’ను చిత్రం బృందం విడుదల చేయగా.. ఆ పాట యూట్యూబ్‌ను షేక్‌ చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రేక్షకుల మదిలో మారుమోగుతున్న ‘సారంగ దరియా’ పాట లిరిక్స్‌ మీ కోసం..   

పల్లవి: దాని కుడీ భుజం మీద కడవా.. దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా 
దాని ఎడం భుజం మీద కడవా.. దాని యెజెంటు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా

చరణం: కాళ్ళకు ఎండీ గజ్జెల్‌.. లేకున్నా నడిస్తే ఘల్‌ ఘల్‌..
కొప్పులో మల్లే దండల్‌.. లేకున్నా చెక్కిలి గిల్‌ గిల్‌..
నవ్వుల లేవుర ముత్యాల్‌.. అది నవ్వితే వస్తాయ్‌ మురిపాల్‌..
నోట్లో సున్నం కాసుల్‌.. లేకున్నా తమల పాకుల్‌..
మునిపంటితో మునిపంటితో.. మునిపంటితో నొక్కితే పెదవుల్‌..
ఎర్రగా అయితదిర మన దిల్‌
చురియా చురియా చురియా.. అది సుర్మా పెట్టిన చురియా
అది రమ్మంటె రాదురా సెలియా.. 
దాని పేరే సారంగ దరియా !! దాని కుడీ భుజం!!
 
చరణం:  రంగేలేని నా అంగీ.. జడ తాకితే అయితది నల్లంగి
మాటల ఘాటు లవంగి.. మర్లపడితే అది శివంగి
తీగలు లేని సారంగి.. వాయించబోతే అది ఫిరంగి
గుడియా గుడియా గుడియా.. అది చిక్కీ చిక్కని చిడియా..
అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా..
దాని సెంపలు ఎన్నెల కురియా.. దాని సెవులకు దుద్దులు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా
దాని నడుం ముడతలే మెరియా.. పడిపోతది మొగోళ్ళ దునియా
అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా

దాని కుడీ భుజం మీద కడవా.. 
  దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా.. 
  దాని పేరే సారంగ దరియా
దాని ఎడం భుజం మీద కడవా.. 
  దాని యెజెంటు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా.. 
  దాని పేరే సారంగ దరియా

చిత్రం : లవ్‌ స్టోరీ
సంగీతం : పవన్‌ సీహెచ్‌
రచన: సుద్దాల అశోక్‌ తేజ 
గానం : మంగ్లీ 

Advertisement
Advertisement