మలయాళంలోకి 'లవ్ స్టోరీ'.. టైటిల్‌ ఏంటో తెలుసా? | Sakshi
Sakshi News home page

మలయాళంలోకి డబ్బింగ్‌ కానున్న 'లవ్ స్టోరీ'

Published Tue, Oct 19 2021 8:54 PM

Love Story Dubbing Version Going Release in Malayalam - Sakshi

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంట శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. సెకండ్ వేవ్ తరువాత థియేటర్లకు పెద్ద సంఖ్యలో జనాలను రప్పించిన సినిమా ఇది. సెప్టెంబర్ 24వ తేదీన విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా.. ఎంతోమంది మనసులను దోచుకుంది. కథా కథనాలే కాకుండా పాటలు సైతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అంత మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా త్వరలోనే మలయాళీ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ మూవీ డబ్బింగ్‌ వెర్షన్‌ ‘ప్రేమ తీరం’ని ఈ నెల 29వ తేదీన అక్కడ విడుదల చేయనున్నారు. కాగా కేరళలోనూ ‘ప్రేమమ్‌’ సినిమాతో సాయిపల్లవికి మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. దీంతో అక్కడ సైతం ఈ మూవీ మంచి కలెక్షన్లను రాబడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

చదవండి: ‘ల‌వ్‌స్టోరి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ట్రైల‌ర్ అదిరిందిగా..

 
Advertisement
 
Advertisement