'ఖైదీ' సీక్వెల్‌పై లోకేశ్‌ కనకరాజ్‌ ట్వీట్‌ | Lokesh Kanagaraj Comments On Khaidi Movie Sequel | Sakshi
Sakshi News home page

'ఖైదీ' సీక్వెల్‌పై లోకేశ్‌ కనకరాజ్‌ ట్వీట్‌

Oct 26 2024 12:20 PM | Updated on Oct 26 2024 12:27 PM

Lokesh Kanagaraj Comments On Khaidi Movie Sequel

ఖైదీ–2 చిత్రం గురించి తాజా అప్‌డేట్‌ వచ్చేసింది. కార్తి కథానాయకుడిగా నటించిన చిత్రం అప్పట్లో భారీ విజయం అందుకుంది. దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ తన కెరియర్‌లో రెండో చిత్రంగా డ్రీమ్‌ వారియర్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం 2019లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. విశేషం ఏమిటంటే..? ఈ చిత్రంలో కథానాయకి లేదు, డ్యూయెట్లు ఉండవు, ఇంకా చెప్పాలంటే అసలు గ్లామర్‌ వాసన లేని చిత్రం ఖైదీ. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తి నటన హైలెట్‌. 

ఖైదీ చిత్రానికి సీక్వెల్‌గా ఉంటుందని అటు దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌, ఇటు కార్తి చెబుతూనే ఉన్నారు. దీంతో ఖైదీ–2 చిత్రం కోసం కార్తి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఖైదీ చిత్రం విడుదలై 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ తన ఎక్స్‌ మీడియాలో పోస్ట్‌చేస్తూ.. ‘అంతా ఇక్కడ నుంచే ప్రారంభమైంది. కార్తి, ఎస్‌ఆర్‌ ప్రభులకు ధన్యవాదాలు. 

వీరి వల్లే లోకేశ్‌ యూనివర్శల్‌ సాధ్యమైంది. త్వరలోనే ఢిల్లీ (ఖైదీ చిత్రంలో కార్త్తి పాత్ర పేరు) తిరిగి రానున్నారు అని పేర్కొన్నారు. అలా ఆయన త్వరలోనే ఖైదీ–2 చిత్రం తెరకెక్కనున్నట్లు ఆయన చెప్పారు. దీంతో కార్తి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం లోకేశ్‌ కనకరాజ్‌ రజనీకాంత్‌ హీరోగా కూలీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత ఖైదీ–2కు సిద్ధమయ్యే అవకాశం ఉందని భావించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement