టాలీవుడ్ సీక్వెల్స్‌కు అడ్డాగా 2022.. కొత్త ఏడాదిలో వచ్చే చిత్రాలివే!

Telugu Movie Sequels 2022 - Sakshi

2022 టాలీవుడ్ సీక్వెల్స్ కు అడ్డాగా మారనుంది. అన్ని కుదిరితే సంక్రాంతి నుంచే సీక్వెల్ సినిమాల హంగామా మొదలు కానుంది. సంక్రాంతికి వచ్చేందుకు నాగార్జున సీరియస్ గా ట్రై చేస్తున్నాడు. 2016 సంక్రాంతి సూపర్ హిట్ సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి కొనసాగింపుగా వస్తోంది బంగార్రాజు. చాలా ఏళ్లుగా దర్శకుడు కళ్యాణ కృష్ణ సిద్దం చేసిన కథ ఇది. సీక్వెల్లో నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్.

2019 సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఎఫ్ 2కు, 2022 ఫిబ్రవరిలో సీక్వెల్ రానుంది. నిజానికి ఈ సీక్వెల్ ను సంక్రాంతి రిలీజ్ చేయాలనుకున్నారు. కాని ఆర్‌ఆర్‌ఆర్, రాధే శ్యామ్ లాంటి భారీ చిత్రాల మధ్య విడుదల అంత మంచిది కాదని, ఫిబ్రవరి 25న ఎఫ్ 3 సోలోగా రిలీజ్ చేస్తున్నారు.

2020 స్లీపర్ హిట్ హిట్ కు ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న హిట్ 2లో హీరో మారిపోయాడు.ఫస్ట్ పార్ట్ లో విశ్వక్ సేన్ ఒక కేస్ ను సాల్వ్ చేసాడు. ఇప్పుడు సీక్వెల్లో ఆ డ్యూటీని అడివి శేష్ తీసుకున్నాడు. సెకండ్ పార్ట్ ను కూడా మొదటి భాగాన్ని తెరకెక్కించిన శైలేష్ కొలను డీల్ చేస్తున్నాడు. కేడీ అనే కూల్ కాప్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు శేష్.

ఈ లిస్ట్ లో ఇంకా చాలా చిత్రాలు ఉన్నాయి. కార్తికేయ 2 ఆల్రెడీ సెట్స్ పై ఉంది. మంచు విష్ణు మరోసారి ఢీ సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీనువైట్ల మేకింగ్ లో డి అండ్ డి అనే సినిమా చేయనున్నాడు.ఇయర్ ఎండ్ కు మరోసారి పుష్ప తిరిగిరానున్నాడు. అలాగే గూఢచారి 2 కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలన్ని వచ్చే ఏడాది ప్రేత్రక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top