లారెన్స్‌తో జోడీ? | Lawrence Sriramaraksha Movie Updates | Sakshi
Sakshi News home page

లారెన్స్‌తో జోడీ?

Published Mon, Feb 5 2024 12:35 AM | Last Updated on Mon, Feb 5 2024 12:35 AM

Lawrence Sriramaraksha Movie Updates - Sakshi

హీరో లారెన్స్‌కి జోడీగా హీరోయిన్‌ శ్రుతీహాసన్‌ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. ‘రైడ్, వీర, రాక్షసుడు, ఖిలాడి’ వంటి పలు చిత్రాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు దర్శకుడు రమేష్‌ వర్మ. ఆయన దర్శకత్వంలో ఘవ లారెన్స్‌ హీరోగా ఓ ప్రాజెక్ట్‌ ఓకే అయిన సంగతి తెలిసిందే. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌పై జ్ఞావవేల్‌ రాజా తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ నిర్మించనున్నారు.రా

ఈ చిత్రానికి ‘శ్రీరామరక్ష’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. కాగా ఈ మూవీలో ఇద్దరు కథానాయికలకు చోటు ఉందట. అందులో ఒక హీరోయిన్‌గా ఇప్పటికే నయనతార పేరు వినిపించింది.. మరో కథానాయికగా శ్రుతీహాసన్‌ నటిస్తారనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీలో లారెన్స్‌కి జోడీగా ‘సీతారామం’ ఫేమ్‌ మృణాల్‌ ఠాకూర్‌  నటించనున్నారంటూ గత ఏడాది వార్తలు వచ్చినా, ఆ తర్వాత ఎలాంటి ప్రకటన లేదు. తాజాగా నయనతార, శ్రుతీహాసన్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నెలలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని టాక్‌. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో హారర్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందని భోగట్టా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement