Lavanya Tripathi Birthday Photos | Lavanya Tripathi Saree Photos - Sakshi
Sakshi News home page

‘అందాల రాక్షసి’ బర్త్‌డే.. చీర కట్టులో..

Dec 15 2020 1:22 PM | Updated on Dec 15 2020 5:37 PM

Lavanya Tripathi Birthday Her Saree Pics Goes Viral On Social Media - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘అందాల రాక్షసి’.. బ్యూటీ లావణ్య త్రిపాఠి నేడు 30వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. డిసెంబర్‌ 15 ఆమె బర్త్‌డే సందర్భంగా హీరో అల్లు శీరిష్‌తో పాటు ప్రముఖ నటీనటులు ఆమెకు బర్త్‌డే విషెష్‌ తెలుపుతున్నారు. అంతేగాక అభిమానుల నుంచి కూడా లావణ్యకు సోషల్‌ మీడియాలో బర్త్‌డే విషెస్‌ వెల్లువెత్తున్నాయి. కాగా అందాల రాక్షసితో టాలీవుడ్ వెండితెరపై మెరిసిన లావణ్య త్రిపాఠి ఆ తర్వాత స్టార్‌హీరోయిన్‌గా ఎదిగారు.

హీరో నాని, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో వచ్చిన ‘భలే భలే మాగాడివోయ్‌’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘మన్మధుడు’ నాగార్జున అక్కినేని సరసన ‘సోగ్గాడే చిన్నినాయన’లో నటించి టాలీవుడ్‌లో అగ్రనటిగా రాణిస్తున్నారు. ఇక ఈ రోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా లావణ్య చీర కట్టులో మెరిసిపోతున్న కొన్ని హాట్‌ ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. 
 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement