
హైమావతి(ఫైల్)
సాక్షి, హైదరాబాద్ : అలనాటి మేటి నటుడు తాడేపల్లి లక్ష్మీ కాంతారావు సతీమణి హైమావతి(87) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లో నివాసం ఉంటున్న ఆమె ఈ మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు. ఈ మేరకు కుటుంబసభ్యులు ఆమె మరణాన్ని ధ్రువీకరించారు. హైమావతి మరణవార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
కాగా, 1951లో వచ్చిన నిర్ధోషి సినిమాతో చలన చిత్ర రంగంలోకి ప్రవేశించారు కాంతారావు. కత్తి ఫైట్లకు ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు. నిర్మాతగా కూడా పలు చిత్రాలు నిర్మించి భంగపడ్డారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకు పోయారు. 2003లో ఆయన చివరి సినిమా కబీర్‌దాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2009 మార్చి 22న క్యాన్సర్ వ్యాధితో మరణించారు.