పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న హీరోయిన్‌‌‌

Lakshmi Rai Discharged From Hospital - Sakshi

ఓ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు హీరోయిన్‌ రాయ్‌లక్ష్మీ. రమణ మొగిలి డైరెక్షన్‌లో రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఓ సినిమా షూటింగ్‌ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా కోసం నీటి లోపల యాక్షన్‌ సీక్వెన్స్‌ తీస్తున్న సమయంలో  రాయ్‌లక్ష్మీ గాయపడ్డారు.

‘‘ఫైటర్స్‌తో ఓ యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరించే సమయంలో రాయ్‌లక్ష్మీ కాలికి గాయమైంది. వెంటనే హాస్పిటల్‌కు తీసుకువెళ్లాం. చికిత్స తీసుకున్నాక, కోలుకుని హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌లో రాయ్‌లక్ష్మీ పాల్గొంటారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇది భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ అని, పెద్ద ప్రమాదం నుంచి రాయ్‌లక్ష్మీ తప్పించుకున్నారని కూడా చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో విలన్‌గా ప్రదీప్‌ రావత్, ఓ కీలక పాత్రను సీనియర్‌ నరేశ్‌ పోషిస్తున్నారు. 

చదవండి: తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం

భార్యకు ఫామ్‌హౌస్‌ రాసిచ్చిన ఎన్టీఆర్!‌

యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ప్రమాదం

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top