
లబ్బర్ పందు చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు అనూహ్య విజయాన్ని అందుకున్నారు. ఈ ఒక్క సినిమాతో స్టార్ హీరోలు, నిర్మాతల దృష్టిలో పడ్డారాయన. దీంతో తన రెండో సినిమాకే స్టార్ హీరో ధనుష్‌తో జతకట్టారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇటీవల నటుడు ధనుష్ హీరోగా నటించిన ఇడ్లీ కడై ఆడియో లాంఛ్ కార్యక్రమంలో డైరెక్టర్ తమిళరసన్ పచ్చ ముత్తు పాల్గొన్నారు.
తన తర్వాత చిత్రాన్ని ధనుశ్‌తోన చేయనున్నానని.. ఆయనకు క్లాప్ కొట్టి యాక్షన్ చెప్పడం కోసం ఎదురు చూస్తున్నట్లు పచ్చముత్తు పేర్కొన్నారు. ధనుశ్ సార్ తన కథను ఒపిగ్గా విన్నందుకు ధన్యవాదాలు అన్నారు. ఆయన చిత్రానికి తాను దర్శకత్వం వహించవచ్చని.. దాన్ని డాన్ ఫిక్చర్స్ సంస్థ నిర్మించవచ్చని.. ఇవన్నీ వదంతులు కావచ్చు అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. అయితే మొత్తం మీద ధనుశ్- తమిళరసన్ పచ్చముత్తు కాంబోలో తెరకెక్కనున్న చిత్రాన్ని డాన్ ఫిక్చర్స్ సంస్థ నిర్మించనుందని క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కానుందో మాత్రం వెల్లడించలేదు. ఈ మూవికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.